ఆచార్యుల అభిప్రాయాలు
1
“వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలకు అన్ని వాదాలకు, అన్ని కవితా ధోరణులకు ఈ పత్రికలో చోటు కల్పించడం ముదావహం. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా “ ఆంధ్ర సాహితి” వెలువడుతుంది. అన్ని అంశాలతో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు పరిశోధకులకు ఆకట్టుకునే విధంగా ఉన్న మంచి పత్రిక ఇది అందుకు కారణం సంపాదకులు ఆచార్య జరా అప్పారావు గారి అకౌంటిక దీక్ష అలుపెరగని పట్టుదల అక్షరం పట్ల ప్రేమాభిమానం అని చెప్పవచ్చు ఢిల్లీ యుజిసి వారు కూడా ఇలాంటి ఉత్తమ పరిశోధనా పత్రికలు విలువరించి రాబోయే పరిశోధకులకు ప్రోత్సహించాలని నిరంతరము చెబుతూనే ఉంది దాన్ని ఆచరణలో పెట్టి నోటికి నోరు పాలు ఆంధ్రప్రదేశ్వ కళాపరిషత్ తెలుగు శాఖ అమలు చేస్తుంది ఇతరులకు మార్గదర్శకంగా ఉంది.”
గౌరవాచార్యులు, తెలుగు శాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్
2
“ఇవాళ తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధికి కానీ ప్రచారానికి కానీ అవసరాలైన సాహిత్య పత్రికలు తెలుగులో లేవని చెప్పవచ్చు అది తెలుగు సాహిత్య పరంగా అతి పెద్ద కొరతై అలాంటి కొరత తీర్చడానికి ఈ పత్రిక చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ పత్రిక బాగా అభివృద్ధి చెంది ఎక్కువమంది సాహిత్యకారులకు ఉపయోగపడుతూ అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”
– ఆచార్య గజ్జా యోహాను బాబు
గౌరవాచార్యులు, తెలుగు శాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్